టీడీపీలో పొత్తులకు సై అన్న బాబు
- PRASANNA ANDHRA

- May 6, 2022
- 1 min read
పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు. శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని, దానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఈ సందర్భంగా బాబు తేల్చిచెప్పేశారు.








Comments