top of page

ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 20, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాబోవు 2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆకాక్షించారు. ప్రస్తుత ప్రభుత్వ విధివిధానాలపై ప్రజలు విసిగిపోయారని రానున్నది టీడీపీ పాలనేనని అన్నారు. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ మాట్లాడుతూ తమ నాయకుడు విజన్ కలవారని, అలాంటి నాయకుడే 2024వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నానని, అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉన్న నాయకుడిగా పేరొందిన చంద్రబాబు మాత్రమే ప్రస్తుత పరిస్థుతులలో రాష్ట్రాన్ని కాపాడగలరని ఆశాభావం వ్వ్యక్తం చేశారు. పట్టణాధ్యక్షుడు ఈ.వి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నాయకుడు చంద్రబాబు అని, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని, ఐటీ రంగానికి పెద్దపీట వేశారని. గత మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు.

తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో గాంధీరోడ్డు లో చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా ప్రజలకు మజ్జిక పంపిణీ చేశారు, అలాగే 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం, వికలాంగులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.


ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్, పట్టణాధ్యక్షుడు ఈ.వి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page