తాళ్లమాపురం ఒకటవ వార్డులో టిడిపి ఇంటింటి ప్రచారం
- PRASANNA ANDHRA

- Aug 17, 2023
- 1 min read
తాళ్లమాపురం ఒకటవ వార్డులో టిడిపి ఇంటింటి ప్రచారం

ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాళ్లమాపురం ఒకటో వార్డు గ్రామ పంచాయతీకి జరిగే ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పసుపుల లక్ష్మీనారాయణమ్మను గెలిపించవలసిందిగా వార్డు ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించిన తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు. వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థి గుర్తు అయినటువంటి కుక్కర్ గుర్తుపై ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులైనటువంటి జయరాజు, గంగులయ్య, పసుపుల మధు వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.












Comments