ప్రొద్దుటూరు ఎస్.వి.టైక్వాండో అకాడమీ లో రెఫరీ శిక్షణ
- EDITOR

- Nov 24
- 1 min read
ప్రొద్దుటూరు ఎస్.వి.టైక్వాండో అకాడమీ లో రెఫరీ శిక్షణ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ అటోనమస్ కళాశాల లో ఎస్వీ టైక్వాండో అకాడమీ గ్రాండ్ మాస్టర్ అలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యములో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ అటానమస్ కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ సహకారంతో కర్ణాటక నుండి వచ్చిన అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్, కుకివోన్ సభ్యుడు వి.నారాయణ స్వామి, తిరుపతి జిల్లా నుంచి వచ్చిన గ్రాండ్ మాస్టర్ ఎ.నారాయణమూర్తి ఎస్వీ టైక్వాండో అకాడమీ విద్యార్థులకి ప్రత్యేక టైక్వాండో రెఫరీ సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ అలిశెట్టి శ్రీనివాసులు, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ మరియు కుక్కివాన్ సభ్యుడు వి.నారాయణస్వామి, గ్రాండ్ మాస్టర్ ఎ.నారాయణమూర్తి, అరకటవేముల పృధ్వీ నారాయణ, పర్లపాడు గౌరీ శంకర్, అంతర్జాతీయ ఛాంపియన్లు బెన్హార్ వరప్రసాద్, కల్లూరు రుద్ర సేన రెడ్డి, టైక్వాండో విద్యార్థులు పాల్గొన్నారు.








Comments