top of page

సువర్ణ భూమి సంస్థ ఎండీపై చీటింగ్ కేసు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 15, 2023
  • 1 min read

ప్లాట్ల విక్రయం పేరుతో బురిడీ

ఎండీతో పాటు ఐదుగురిపై చీటింగ్ కేసు

బోగస్ రశీదులతో మాయ

సువర్ణ భూమి సంస్థ ఎండీపై చీటింగ్ కేసు

ree

'తరాలు మారినా చెరగని చిరునామా' అంటూ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికిన ప్రముఖ రియల్ ఎస్టేస్ సంస్థ సువర్ణభూమి సంస్థ ఎండీపై చీటింగ్ కేసు నమోదైంది. కస్టమర్ల నుంచి డబ్బు కట్టించుకొని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయని కారణంగా ఎండీతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి.

ree

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సువర్ణభూమి సంస్థపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లాట్లు విక్రయిస్తామంటూ పలువురి వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేయటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్, ఉద్యోగులు గంగిరెడ్డి, దస్తగిరితోపాటు మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.

ree

వివరాల్లోకి వెళితే.. సువర్ణభూమి సంస్థ 2017లో షాద్ నగర్ సమీపంలో సువర్ణ కుటీర్ పేరుతో వెంచర్ ప్రారంభించారు. ఈ వెంచర్‌లో కృష్ణానగర్‌కు చెందిన కొండల్‌రావు అనే వ్యక్తితో పాటు సినీ పరిశ్రమలో పనిచేసే 21మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. రూ.6 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు చెల్లించి వెంచర్‌లో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వీరిని సంస్థ ఉద్యోగి దస్తగిరి షాద్‌నగర్‌ తీసుకువెళ్లి ఫ్లాట్లను చూపించి వారితో డబ్బులు కట్టించాడు.

ree

ఆ తర్వాత సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్ తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాల్లో పూర్తి డబ్బులు చెల్లించారు. ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్నారు. బాధితులు ఎప్పుడు అడిగినా.. రేపుమాపు అంటూ కాలయాపన చేయసాగారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్‌లోని సంస‌్థ కార్యాలయానికి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు

ree

అయితే.. బాధితులు చెల్లించిన సొమ్ములో 20 శాతం మాత్రమే సంస్థకు ముట్టిందని.. మిగిలిన డబ్బు తమకు అందలేనది సంస్థ యాజమాన్యం చెప్పింది. పూర్తి డబ్బు చెల్లించకుండా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేమని అన్నారు. వారి మాటలు విని ఆందోళనకు గురైన బాధితులు.. తాము పూర్తిగా నగదు చెల్లించామని రశీదులను చూపించారు. వాటిని చూసిన యాజమాన్యం.. అందులో కొన్ని మాత్రమే అసలైనవని, మిగిలినవి ఫేక్ రశీదులని చెప్పారు. వాటితో తమ సంస్థకు సంబంధం లేదని చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సువర్ణభూమి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంస్థ ఎండీీతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page