top of page

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 15, 2022
  • 1 min read

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు


తెలుగు చిత్రసీమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి, టాలీవుడ్​ జేమ్స్​ బాండ్ సూపర్​స్టార్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ree

ఇదీ జరిగింది.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉంటున్న కృష్ణ.. ఆదివారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడ్డారు. అలానే ఆయనకు స్వల్ప గుండెపోటు కూడా వచ్చింది. దీంతో హుటాహుటిన.. మహేశ్​బాబు భార్య నమ్రత.. కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ అవార్డుకు తరలించి సీపీఆర్​ నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత వైద్యులు ప్రెస్​మీట్​ పెట్టి.. కృష్ణ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు.శరీరంలో కూడా చలనం లేదని తేల్చిచెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, సినీప్రముఖులు ఆందోళన చెందారు. కృష్ణ కోలుకోవాలని ప్రార్థించారు. వైద్యులు కూడా ఎంతగానో ఆయన్ను కాపాడేందుకు శ్రమించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన కొన్ని గంటల్లోనే చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు.


వరుస మరణాలు.. కాగా, ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది వరుసగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆ ఫ్యామిలీలో సూపర్​ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​ బాబు ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో, నెలన్నర క్రితం ఆయన భార్య ఇందిరా దేవి వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై వయసు రీత్యా సమస్యలతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page