కుళ్లిన కోడి గ్రుడ్లు తిని విద్యార్థులకు అస్వస్థత
- PRASANNA ANDHRA

- Jul 26, 2022
- 1 min read
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం లో కుళ్ళిపోయిన కోడి గుడ్లు తిని 37 మంది చిన్నారుల కడుపులను కలిమేసింది రోజు లాగానే మెనూ ప్రకారం స్కూలు యాజమాన్యం చిన్నారులకు భోజనాన్ని వడ్డించారు భోజనం తిన్న పది నిమిషాలకే 37 మంది చిన్నారులకు వాంతులు తల తిరగడం వంటి లక్షణాలతో పిల్లల కుప్పకూలిపోయారు గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు అస్వస్థతకు గురైన చిన్నారులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భోజనంలో కుళ్లిపోయిన గుడ్డు తినడం వల్లే చిన్నారులు కళ్ళు తిరిగి కిందపడిపోయారని తల్లితండ్రులు వాపోయారు.








Comments