ప్రొద్దుటూరులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- PRASANNA ANDHRA

- Jun 27, 2023
- 1 min read


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులోని శ్రీ రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో తృతీయ సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న 18 సంవత్సరాల విద్యార్థిని మంగళవారం ఉదయం కళాశాల మేడ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలియ రాలేదు. సంఘటనా స్థలం నుండి అమ్మాయిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోటో ఆధారంగా అమ్మాయికి రెండు కాళ్లకు, తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు కు తరలించారు. అక్కడికి వచ్చిన కళాశాల యాజమాన్యాన్ని పాత్రికేయులు వివరణ కోరగా తమకేమీ పట్టదు అన్నట్లు పలాయనం చిత్తగించటం ఇక్కడ గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.










Comments