ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి. వేణుగోపాల్ రెడ్డి
- EDITOR

- 22 hours ago
- 1 min read
ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి. వేణుగోపాల్ రెడ్డి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ఎస్ టి యు (రాష్ట్రోపాధ్యాయ సంఘం) ఆంధ్రపదేశ్ వారి 79వ వార్షిక కౌన్సిల్ సమావేశాలు కడపలో ఘనంగా నిర్వహించారు. కడప ఆర్ట్స్ కాలేజీ నుండి జడ్పీ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యా సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎస్టియు కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎస్టియు ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమక్షంలో నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రొద్దుటూరు రీజియన్ నుండి డి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్టియు రీజనల్ కన్వీనర్ డి సలీం, కొత్తపల్లి శీను, ఓబులరెడ్డి, వై సుబ్రహ్మణ్యం, వివేకానంద రెడ్డి, సంజీవరెడ్డి, జిసిఎం రెడ్డి, రవి, కొండయ్య, రమేష్ బాబు, కోనేటి శ్రీను, సుబ్బరాయుడు, నందగోపాల్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.








Comments