పలువురు కార్పొరేషన్ డైరెక్టర్ల రాజీనామా
- PRASANNA ANDHRA

- Jun 7, 2024
- 1 min read
పలువురు కార్పొరేషన్ డైరెక్టర్ల రాజీనామా


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి ఓటమి చవి చూసిన నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని పలు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వైసిపి ప్రభుత్వ హయాంలో వారికి ఇచ్చిన పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ సానపురెడ్డి ప్రతాపరెడ్డి, సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పర మురళి, క్రిష్టబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ తుపాకుల వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి నరసింహారావు, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చౌడం రవి, ఆరె కటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, నాటక కళా అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ బండారు నాగలక్ష్మి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమపై నమ్మకం నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను పలు శాఖలకు డైరెక్టర్లుగా నియమించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఓటమి చవి చూసిన నేపథ్యంలో వారు తమ శాఖలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.












Comments