శ్రీశైలంలో లోయలో పడబోయిన తెలంగాణ ఆర్టీసీ మహబూబ్ నగర్ బస్సు
- PRASANNA ANDHRA

- Jan 29, 2023
- 1 min read
శ్రీశైలంలో లోయలో పడబోయిన తెలంగాణ ఆర్టీసీ మహబూబ్ నగర్ బస్సు
శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది. లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, బస్సు యధావిధిగా మహబూబ్ నగర్ కి చేరుకుంటుంది.








Comments