top of page

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 16 లక్షలు విరాళం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 2, 2022
  • 2 min read

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 16 లక్షలు విరాళం

ree

శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం (లోబావి) నందు భక్తులకు బస సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ప్రారంభించిన 125 గదుల కైలాస సదన్ అతిథి గృహం నందు దాతలు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం విరాళాల స్వీకరణ కొనసాగిస్తున్నది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు కి శ్రీ గీతభ్యాసరత సమాజం భరద్వాజ తీర్థం శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీశ్రీశ్రీ రామ్మూర్తి స్వామి వారు ఇది వరకు స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన సందర్భంలో వారికి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దగ్గరుండి ఆలయం నందు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి అమ్మవార్ల ఆలయంలోని పలు సేవా కార్యక్రమాలు మరియు భక్తులు అందజేయు విరాళాలు గూర్చి తెలియజేయటం జరిగినది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కైలాస సదన్ గదుల విరాళాల గూర్చి వారికి తెలియజేసి, వారిని వెంట తీసుకెళ్లి కైలాస సదన్ అతిథి గృహమును సందర్శింపజేసి వారిని విరాళం అందజేయవలసిందిగా ఛైర్మన్ ని కోరడం జరిగినది.

CALL NOW 9912324365
CALL NOW 9912324365

శ్రీ రామ్మూర్తి స్వామి వార ఆలయనికి విచ్చేసి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో కైలాసదన్ అతిధి గృహంలోని మొదటి బ్లాక్ లోని గది నెం:5,6 రెండు సింగల్ రూములకు గాను ఒక్కొక్క రూముకు 8 లక్షల రూపాయల చొప్పున రెండు సింగల్ రూములకు గాను విరాళంగా 16,00,000/- (పదహారు లక్షల రూపాయలు) చెక్కును చైర్మన్ కి అందజేశారు. వారికి దేవస్థానం చైర్మన్ అభినందనలు తెలియజేసి, ఘనంగా శేష వస్త్రములతో సత్కరించి, వేద పండితులతో వేదమంత్రాలతో ఆశీర్వచనాలు ఇప్పించి, స్వామి అమ్మవార్ల వస్త్రాలను, చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేసి తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిథి గృహాల సముదాయం నందు గల రెండు బ్లాక్స్ లోని 125 గదుల్లో 101 సింగిల్ రూమ్స్, 24 సూటు రూమ్స్ ఉన్నాయని, ఒక్కొక్క సూట్ రూమ్ కు 15 లక్షలు చొప్పున, ఒక్కొక్క సింగిల్ రూమ్ కు 8 లక్షలు చొప్పున దాతలు విరాళం చెల్లించి స్వామిఅమ్మవార్ల సేవలో భాగస్వామ్యం అయ్యేవిధంగా దేవస్థానం అవకాశం కల్పించిందన్నారు. దాతలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విరాళంగా పొందిన గదులను దాతల కుటుంబాలకు మరియు వారు తెలియజేసిన వారికి ఒక్క సంవత్సరానికి 45 రోజుల వరకు ఉచితంగా బస వసతి కల్పిస్తున్నామని, కావున భక్తులు దేవస్థానం అతిథి గృహాల్లో దాతలు భాగస్వామ్యం అయి ఆ కైలాసనాధుని సేవలో తరించే విధంగా దాతలకు అవకాశం కల్పిస్తున్నట్లు కోరిన విధంగానే దాతలు ముందుకొస్తున్నారని, అదేవిధంగా మన ప్రాంత వాసులు ముందుకు రావాలని, ఇతర ప్రాంతాల భక్తులకు కూడా తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనింపజేయాలని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసి మల్లికార్జునరావు, విజయలక్ష్మి, చెంచు రాఘవులు, నరసింహ గుప్త ,చంద్రశేఖర్ రాజు ,ప్రమీలమ్మ ,సుధాకర్ రాజు, కళ్యాణ్ చక్రవర్తి , శివశంకర్, శ్రీనివాస్, అయ్యప్ప ,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page