శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
- PRASANNA ANDHRA

- Oct 26, 2022
- 1 min read
శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
క్యూలైన్‌లో కొట్లాట, వైసీపీ మంత్రీ పెద్దిరెడ్డి సమక్షంలో ఆలయంలో దాడులు ,ప్రతి దాడులు
ఇంకా వివరణ ఇవ్వని ఎండోమెంట్స్ అధికారులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు క్యూలైన్‌లో కొట్టుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్టుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. దీంతో క్యూలైన్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది. దీంతో ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.








Comments