top of page

ఇంటర్ ఫలితాలలో శ్రీ విద్యా విద్యార్థుల విజయభేరి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 12, 2024
  • 1 min read

ఇంటర్ ఫలితాలలో శ్రీ విద్యా విద్యార్థుల విజయభేరి

ree
విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు

ప్రొద్దుటూరు, స్థానిక సూపర్ బజార్ రోడ్డు నందు గల శ్రీ విద్యా జూనియర్ కాలేజి విద్యార్థులు శుక్రవారం ఉదయం విడుదలైన ఇంటర్ ఫలితాలలో విజయభేరి మోగించారని ఆ కళాశాల ప్రిన్సిపల్ రమణరావు, డైరెక్టర్లు శ్రీకాంత్ రెడ్డి, మలిశెట్టి రామమోహన్ రావు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ ఫలితాలలో జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను సఫియా 434 మార్కులతో టౌన్ ఫస్ట్, మూయిజ్ 431 మార్కులతో టౌన్ సెకండ్ మార్కులతో నిలవగా, తహసిన్ 427, రహమతుల్లా బేగం 425 మార్కులు సాధించారని, అలాగే ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఉషశ్రీ, సాహితీ లు 463 మార్కులు, నవాల్, యోషితా, లిఖిత 462 మార్కులు, గీతాంజలి, గాయత్రీ, నస్రీన్ 461 మార్కులు సాధించారని, సీనియర్ ఇంటర్ ఫలితాలలో బైపీసీ విభాగంలో వేయి మార్కులకు గాను హరిణి 982 మార్కులతో టౌన్ సెకండ్, ఎంపిపి విభాగంలో భరత్, ధరణీధర్ లు 985, అఫీషా 984, స్పందన, నందిని, కుముదిని, తనూజ 983 మార్కులు సాధించారని తెలిపారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థినులను అభినందించారు. కళాశాల బోధనా సిబ్బంది తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వలన తాము ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు.

ree
ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 12, 2024
Rated 5 out of 5 stars.

Good job students

Like
bottom of page