ఘనంగా శ్రీనారాయణమ్మ ఆరాధన కార్యక్రమం.
- DORA SWAMY

- Oct 24, 2023
- 1 min read
ఘనంగా శ్రీ నారాయణమ్మ ఆరాధన కార్యక్రమం.

చిట్వేలి మండల పరిధిలోని తిమ్మాయపాలెం క్రాస్ రోడ్ శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన ఆశ్రమం నందు ఆశ్రమ వ్యవస్థాపకురాలైన శ్రీ నారాయణమ్మ మొదటి ఆరాధన కార్యక్రమాన్ని సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు.గురువు రామచంద్రయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం భగవద్గీత పారాయణం, గురుపూజ కార్యక్రమం, కుంకుమ పూజ, మధ్యాహ్నం మహాఅన్నదానం, హరే రామ భజన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

తన జీవితాంతం భగవంతుని స్మరిస్తూ, పలు దేవాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసి మండల పరిధిలోని ప్రజల మనసులో సుస్థిర స్థానం పొందిన స్వర్గస్తురాలు నారాయణమ్మ కృషిని పలువురు కొనియాడారు.ఎం గొల్లపల్లి,ఎం రాచపల్లి,బి కొత్తపల్లి, రాజు కుంట, అనుంపల్లి,చెర్లోపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా చిన్నపరాజు, చెంగల్ రాజు, పులంరాజు, గిరిబాబు రాజు, రాజేష్ రాజు, వరుణ్ కుమార్ రాజు,వెంకట్రామరాజు, వెంకటసుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రధాన పాత్రను పోషించినట్లు ఆశ్రమ నిర్వాహకులు నాగేశ్వరమ్మ,చంద్ర శేఖర్
పద్మావతమ్మ లు తెలియ పరిచారు.








Comments