అట్టహాసంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ
- EDITOR

- Jan 17, 2023
- 1 min read
అట్టహాసంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
పాత బస్టాండ్ కూడలిలో మంగళవారం విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయయుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పాలన భావితరాలకు ఆదర్శమని తెలిపారు. ఆయన పాలనలో బంగారు రాసులు పోసి అమ్మేవారని అన్నారు. అష్టదిగ్గజాలను ఆస్థాన కవులుగా నియమించి పండితులను ప్రోత్సహించడంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన విగ్రహం వాడ వాడలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments