top of page

శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 25, 2024
  • 2 min read

శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరు, నవంబర్ 25


ప్రముఖ వ్యాస రచయిత డాక్టర్ ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు రచించిన శ్రీ అగస్టేశ్వర స్వామి ఆలయం పుస్తకాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకులు ప్రొద్దుటూరు నడిబొడ్డున శివాలయాన్ని నిర్మించారని ఆలయ పోషణకు వందల ఎకరాలు తమ సొంత భూములు కేటాయించారన్నారు. ఆలయ భూములను కూడా వదలక ఆక్రమిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, అలాంటి వారిని దేవుడు క్షమించరని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆగేశ్వర స్వామి శివాలయం చరిత్రను అవగాహన చేసుకుని పుస్తకాన్ని రచించిన డాక్టర్ ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు అభినందనీయులని కొనియాడారు. శివాలయం చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చని ఈ పుస్తకాన్ని విక్రయించి ఆలయ ప్రాశస్యాన్ని తెలుసుకోవాలని సూచించారు.

ree

ముందుగా పుస్తక సమీక్షకులు ఎస్ మహబూబ్ బాషా మాట్లాడుతూ రచయిత చంద్రశేఖర రావు కడప జిల్లా వాసిని ప్రొద్దుటూరులో జన్మించారన్నారు. శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తకంలో రచయిత పొందుపరిచిన అంశాలను సంక్షిప్తంగా ఆయన వివరించారు. శివాలయంలోని శివలింగాన్ని అగస్త్య ముని ప్రతిష్టించారని అందుకే శ్రీ అగస్టేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లుగా అందరికీ తెలుసన్నారు, కానీ ఆలయంలోని ఉప ఆలయాల సమీకరణ పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం లాంటి విశేషాలను పొందుపరచారన్నారు. కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎన్నో ఆలయాలు సందర్శించి సుమారు 33 పుస్తకాలు రచించిన డాక్టర్ ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు శ్రీ అగస్తేశ్వర స్వామి చరిత్రను రాయడం ఆ పుస్తకాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు కలిగిన మహాభాగ్యంగా ఆయన అభివర్ణించారు.

ree

తాను శివాలయం చైర్మన్గా ఉన్న సమయంలో రెండు గాలిగోపురాలు నిర్మించామని, అంతే కాకుండా ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. రచయిత ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు మాట్లాడుతూ, తన జన్మ నేపథ్యం ప్రొద్దుటూరు అని బాల్యంలో చాలాసార్లు శివాలయాన్ని సందర్శించారని అన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన అలాంటి శివాలయ చరిత్రను రచించడం తనకు శివుడు ఇచ్చిన భాగ్యమన్నారు. ఈ పుస్తకాన్ని ప్రచురించి ఘనంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అవధాని నరాల రామారెడ్డి, శివాలయం చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, ప్రముఖ కథా రచయిత డీకే చదువుల బాబు, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ జనార్ధన్, కొనిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page