top of page

ప్రొద్దుటూరు చిన్నారుల ప్రతిభ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 28, 2022
  • 1 min read

Updated: Nov 29, 2022


ree

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణిస్తున్న ప్రొద్దుటూరు బుడతలు, వై.వి.ఎస్ మునిసిపల్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణంలో మాస్టర్ మునీశ్వర్ సారథ్యంలో టైక్వాండో ప్రత్యేక తర్ఫీదు పొందిన పలువురు చిన్నారులు టైక్వాండో క్రీడలో రాణిస్తున్నారు, ప్రత్యేక శ్రద్ధ పరివేక్షణల నడుమ చిన్నారులు అనతి కాలంలోనే తాము అనుకున్నది సాధించి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేస్తున్నారు.

ree

అంకుంఠిత దీక్ష పట్టుదలతో తాము అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో చిన్నారులు అలుపెరుగక రేయింపవళ్ళు కష్టపడి విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యాలకు గురి చేస్తుండగా, తాజాగా అయిదవ రాష్ట్ర టైక్వాండో ఛాంపియన్షిప్ 2022 పోటీలు విశాఖపట్నం నందు నవంబర్ 26వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగాయి, ప్రొద్దుటూరుకు చెందిన వేధన్ బంగారు పధకం సాధించగా, సత్యానంద బ్రహ్మ వెండి పధకం సాధించారు. క్రీడాకారులను పలువురు అభినందించగా, తల్లిదండ్రులు తమ బిడ్డలు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page