నిద్రిస్తున్న మహిళ పై పడగ విప్పి పడుకున్న పాము
- PRASANNA ANDHRA

- Aug 28, 2022
- 1 min read
పొలంలో నిద్రిస్తున్న మహిళ పై పడగ విప్పి పడుకున్న పాము

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మల్లాబాద్ కు చెందిన భాగమ్మ అనే మహిళ తన పొలంలో పడుకుంది. అప్పుడు ఆమె వీపు మీద పెద్ద నాగు పాము వచ్చి పడగ విప్పి కూర్చుంది. దాన్ని అక్కడున్న వారు చూసి,అరవడంతో మహిళకు మెళకువ వచ్చింది. ఈ క్రమంలో.. మహిళ వెంటనే భయంతో వణికిపోయింది. పాము మాత్రం పడగ విప్పుకుని, బుసలు కొడుతూ.. అక్కడ నిలబడి చూస్తుంది. ఆమె భయంతో శ్రీ శైలం మల్లన్న, జై మల్లీకార్చున అంటూ శివుడిని పదే పదే తలుచుకుంది. పదే పదే ఆ శివుని పేరు బిగ్గరగా జపం చేసింది.
అయితే.. ఆ దేవుడు అనుగ్రహించాడో మరేంటో కానీ.. ఆ పాము కాసేపు అక్కడే ఉంది, ఆ తర్వాత వెళ్లిపోయింది. ఇదంతా అక్కడ గట్టుమీద ఉన్నమరో బాలుడు రికార్డు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. నిజంగా ఆమెకు లక్ బాగానే ఉందని కొంత మంది, ఆమెకు ఇది పునర్జన్మ అంటూ మరికొంత మంది కామెంట్ లను పెడుతున్నారు.








Comments