సినీ పరిశ్రమలో మరో విషాదం ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం
- EDITOR

- Feb 4, 2023
- 1 min read
సినీ పరిశ్రమలో మరో విషాదం ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం...

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది, ప్రముఖ సింగర్ వాణీ జయరాం(78) హఠాన్మరణం చెందారు. చెన్నైలోని ఆమె నివాసంలో అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వీ విశ్వానాథ్ మరణం నుంచి కోలుకోకముందే వాణిజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె తెలుగు, తమిళంతో సహా వివిధ భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డు ఆమె అందుకోకముంద వాణీ మృతి చెందడం విచారకరం. తెలుగు తమిళంలో సహా పలు భాషల్లో ఆమె పదివేలకు పైగా పాటలు పాడారు.








Comments