top of page

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి - ఎస్.ఐ రెడ్డి సురేష్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 4, 2022
  • 1 min read

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి - ఎస్.ఐ రెడ్డి సురేష్

ree

కడపజిల్లా, ప్రొద్దుటూరులోని సాయిశ్రీ హాస్పిటల్ నందు ఒక మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా, వారు డొక్కా సీతమ్మ అన్నదాన రక్తదాన సేవా సంస్థ పర్యవేక్షకుడు గంజి సురేష్ కుమార్ ను సంప్రదించగా, విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్సై రెడ్డి సురేష్ స్పందించి వెంటనే మహిళకు ఓ పాజిటివ్ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి, స్థానిక సురక్ష వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు రక్తదానం చేశారు. అధికారి హోదాలో రక్తదానం చేసిన ఎస్సై రెడ్డి సురేష్ కు డొక్కాసీతమ్మ అన్నదాన రక్తదాన సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి ప్రసన్న, వైస్ ప్రెసిడెంట్ నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్ శాలువతో ఎస్సై రెడ్డి సురేష్ ని సన్మానించారు.

ree

అనంతరం ఎస్సై రెడ్డి సురేష్ మాట్లాడుతూ ప్రాణాపాయ అత్యవసర స్థితిలో రోగులకు లేదా క్షతగ్గాత్రులకు రక్తదానం చేయటంలో తనకు ఆత్మ సంతృప్తి నిస్తుందని, అలా రక్తదానం చేయటం మరొకరి ప్రాణాన్ని కాపాడటమేనని, సామాజిక భాద్యత గల పౌరుడిగా తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని, ఆరోగ్య రీత్యా తాను ప్రతి మూడు లేదా నాలుగు మాసాలకు ఒకసారి తప్పనిసరిగా రక్తదానం చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువత అపోహలు విడనాడి రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మంచి హృదయంతో స్పందించి రక్తదానం చేసిన టూ టౌన్ ఎస్సై రెడ్డి సురేష్ కి డొక్కా సీతమ్మ అన్నదాన రక్తదాన సేవా సంస్థ తరుపున ఆ సంస్థ రక్తదాన విభాగ పర్యవేక్షకుడు గంజి సురేష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

Recent Posts

See All
బిజెపి ఉపాధ్యక్షురాలు రాజీనామా

బిజెపి ఉపాధ్యక్షురాలు రాజీనామా వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు తనకు బిజెపి లో సముచిత స్థానం ఇవ్వలేదని, తనను కనీసం కార్యకర్తగా గుర్తించలేదని, దేశ, రాష్ట్ర రాజకీయాలు, అలాగే పలు దేశీయ రాష్ట్ర పరిణామ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page