బిజెపి ఉపాధ్యక్షురాలు రాజీనామా
- MD & CEO

- 12 minutes ago
- 1 min read
బిజెపి ఉపాధ్యక్షురాలు రాజీనామా
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తనకు బిజెపి లో సముచిత స్థానం ఇవ్వలేదని, తనను కనీసం కార్యకర్తగా గుర్తించలేదని, దేశ, రాష్ట్ర రాజకీయాలు, అలాగే పలు దేశీయ రాష్ట్ర పరిణామాలపై స్పందించి తాను అనర్గళంగా మాట్లాడగలనని, అలాంటి తనపై వివక్ష చూపుతూ తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జిల్లా బిజెపి శ్రేణులు, ఇక్కడి నియోజకవర్గ నాయకులకు అప్పజెప్పినట్లు, ఇందుకు గాను తాను అనగా రోటికాడి రెడ్డమ్మ ప్రొద్దుటూరు నియోజకవర్గ బీజేపీ టౌన్ వన్ ఉపాధ్యక్షురాలుగా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలియవస్తోంది... గడచిన ఆరు నెలలుగా ఏ ఒక్క పాత్రికేయుల సమావేశం నందు తనతో పత్రికా ముఖంగా మాట్లాడించలేదని, పత్రికా ప్రకటన ఇప్పించలేదని, కేవలం మందలో గొర్రెలా తనను చూశారని, గతంలో కూడా తన మామ అయిన బీజేపీ జిల్లా కార్యదర్శి కొర్రపాటి కంబగిరి రావు కు కూడా చేదు అనుభవాలు, గుర్తింపు మిగిలాయని, తాను పార్టీ కోసం ఎల్లవేళలా అహర్నిశలు శక్తి వంచన లేకుడా పనిచేస్తానని చెప్పినప్పటికీ బిజెపి నియోజకవర్గ శ్రేణులు తనను విస్మరించారని ఓ సన్నిహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారని బోగొట్టా... హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా తాను గోకుల్ నగర్ నందు హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయమని అడగగా, హౌసింగ్ బోర్డ్ నందు కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వారికి సహకరించమని చందాలు వసూలు చేసిన కొందరు ప్రలోభ పెట్టినట్లు... లక్షలు ఖర్చు చేసి తాను తన వార్డు నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తానని చెప్పినప్పటికీ తనను బిజెపి నాయకులు, శ్రేణులు విస్మరిస్తున్నారని తోటి బిజెపి నాయకుల వద్ద తన ఆవేదనను వెళ్ళబుచ్చినట్లు గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ నాయకులు వారి వ్యక్తిగత మనోభావాలు ప్రక్కన పెట్టీ పార్టీ అభివృద్ధికి దోహదపడుతూ మారతారని తాను ఆశిస్తున్నట్లు ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్ న్యూస్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దశాబ్దాల కాలంగా బిజెపి సిద్ధాంతాలను పుణికిపుచ్చుకుని, పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని, పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, ఏ పదోన్నతి ఆశించకుండా, పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు చేమట చిందిస్తూ... కాషాయ జెండాలు తమ భుజాన వేసుకున్న బీజేపీ నాయకులు ఏమనాలి ...???








Comments