స్మాషర్స్ గ్రూప్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్
- EDITOR

- Oct 3, 2023
- 1 min read
స్మాషర్స్ గ్రూప్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్

రాజంపేట
నందలూరు మండలంలోని రైల్వే పరిసర ప్రాంతంలో ఉన్న సంఘ్ కార్యాలయం స్మాషర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ లో రాజంపేట కు చెందిన శంకర (మాక్కా) టీమ్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ 36 జట్లు పాల్గొన్నాయి అని ఆర్గనైజర్ కమిటీ తెలిపారు. గత మూడు రోజులుగా జరిగిన ఈ టోర్నమెంట్ స్థానికంగా ఉన్న ప్రజలు లను అలరించాయి. జిల్లా స్థాయి లోని పలు ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ జయ భాస్కర్ రావు, ఎస్ ఐ అబ్దుల్ జహీర్, కడప సి సి ఎస్. ఎస్ ఐ శ్రీధర్ బాబు, సంఘ్ అధ్యక్షులు పి. ఇ. కే.మూర్తి కార్యదర్శి రవిప్రకాష్, లోకో ఆఫీస్ ఓ ఎస్ రవి శంకర్ హాజరు కావడం జరిగింది. ఈ టోర్నమెంట్ విజయం సాధించిన రాజంపేట కు చెందిన శంకర్ జట్టుకు 6000 మరియు షీల్డ్ అందజేశారు, అలాగే రెండవ స్థానం లో నిలిచిన మస్తాన్ జట్టు కు 4000 మరియు షీల్డ్, మూడవ స్థానం లో నిలిచిన మురళి జట్టుకు 2000 మరియు షీల్డ్ , నాల్గవ స్థానంలో నిలిచిన అఖిల్ జట్టుకు 1500 మరియు షీల్డ్ అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ ను కమిటీ సభ్యులు హీమండర్ సింగ్, అఖిల్, లాయర్ మోహన్, సాబేర్, దర్మతేజ, సాయి తేజ, అభినయ్, ప్రవీణ్, హరీష్, వెంకటేష్ లు చాలా బాగా నిర్వహించారని అన్నారు.









Comments