జాతరలో పోకిరీలు, ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులు
- EDITOR

- Mar 13, 2022
- 1 min read
భోపాల్ లో ఇద్దరు అమ్మాయిలను అందరూ చూస్తుండగానే లైంగిక వేధింపులకు గురి చేశారు. తాజాగా ఓ పోకిరి గ్యాంగ్ మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా హింసకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే అలిరాజ్‌పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో హోలీకి ముందర అలిరాజ్‌పూర్, ఝాబువా, దర్, బర్వాని, సహా పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల జాతర భగోరియా జరుగుతుంది, జాతరలో మార్చి 11వ తేదీన ఓ అభ్యంతరకర అవమానకర సంఘటన చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఓ గ్యాంగ్ రోడ్డుపై విచ్చలవిడిగా అరుచుకుంటూ బీభత్సం సృష్టిస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గిరిజన యువతులు, ఇంతలో ఓ పోకిరి ఒక అమ్మాయి వైపు పరుగెత్తి తన వైపు లాక్కున్నాడు. లైంగికంగా వేధించాడు. అయితే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.








Comments