కౌన్సిలర్ తలకు తీవ్రగాయం
- PRASANNA ANDHRA

- Nov 3, 2022
- 1 min read

గురువారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ మున్సిపల్ ఆరవ వార్డు కౌన్సిలర్ ఎద్దుల జయంతికి ప్రెషర్ కుక్కర్ పేలి తలకు తీవ్ర గాయాలు కాగా, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె తలకు దాదాపు నలబై కి పైగా కుట్లు పడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స పొందుతున్న కౌన్సిలర్ జయంతి ని నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరామర్శించి, జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని, ఆసుపత్రి వర్గాలకు సరయిన చికిస్త అందించమని కోరారు. అనంతరం కౌన్సిలర్ జయంతి కుమారుడు నెల్సన్ కుమార్ కు తానున్నానని భరోసా కల్పించి, త్వరలో ఆమె పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్సించిన వారిలో ఎమ్మెల్యే రాచమల్లు తో పాటు మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.









Comments