SAY NO TO DRUGS - NALLABOTHULA
- PRASANNA ANDHRA

- Apr 7, 2023
- 1 min read
SAY NO TO DRUGS

అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను నేడు వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనలో యువతకు ఉద్యోగఅవకాశాలు కల్పించకుండా యువతను మత్తుకు బానిసలుగా చేసిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, పారిశ్రామిక ఉత్తరాంధ్రను మత్తు ఉత్తరాంధ్రగా ఈ ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఇందుకు ఉదాహరణ కేవలం ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల కేజీల గంజాయి దొరకడం అని ఆయన అన్నారు. ఏపీలో ప్రజలు ఉద్యోగాలు లేక, మత్తుకు బానిసై ఏడు వందల యాబై మంది చనిపోవడం దారుణం అన్నారు. యువతను మత్తు నుండి, ఉద్యోగాల వైపు నడిపించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.











Comments