బాల్య వివాహాలు వద్దు - చదువే ముద్దు
- PRASANNA ANDHRA

- Sep 29, 2023
- 1 min read
బాల్య వివాహాలు వద్దు - చదువే ముద్దు

కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు, సంజీవ నగర్ అంగన్వాడీ సెంటర్ పరిధిలోని శాంతి నికేతన్ పాఠశాలలో బాల్య వివాహాలు చేసుకోరాదని, ఆడపిల్లకి 18, మగపిల్లలకు 21నిండే వరకు పెళ్లి చేసుకోకూడదని అలా వివాహాలు జరిగిన ఎడల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పిల్లలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మహిళ పోలీసులు రమ్య, స్వర్ణ లత, దేవి, సంధ్య, అంగన్వాడీ కార్యకర్తలు నాగలక్ష్మి, సుబ్బమ్మ, విద్యార్థులు, పాఠశాలలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









Comments