సత్తెనపల్లి లో దారుణం
- EDITOR

- Dec 12, 2022
- 1 min read
సత్తెనపల్లి లో దారుణం
పలనాడు జిల్లాలో దారుణం.. కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి. సత్తెనపల్లి పట్టణంలో వడ్డవల్లిలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. వ్యాపారంలో తేడాలు రావడంతో ఆగ్రహించిన తండ్రి కనకారావు కొడుకు బాజీని కత్తితో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన కొడుకు బాజీని హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








Comments