top of page

'స‌ర్కారువారి పాట' సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 7, 2022
  • 1 min read

'స‌ర్కారువారి పాట' సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి, టికెట్‌పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి, 10 రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు. ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం.

ree

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం స‌ర్కారువారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి నిచ్చింది.


ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 


ఆయా సినిమాల విడుద‌లకు ముందు స‌ద‌రు సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థిస్తున్న సంగ‌తి తెలిసిందే.


ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు... స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page