లాభాపేక్ష లేకుండా కళాశాల నిర్వహిస్తున్నాం - శారదా జూనియర్ కళాశాల
- PRASANNA ANDHRA

- Aug 1, 2022
- 1 min read
లాభాపేక్ష లేకుండా కళాశాల నిర్వహిస్తున్నాం - ఎం సురేష్ బాబు రెడ్డి
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని త్రీటౌన్ ఎస్ఐ రాజగోపాల్ పేర్కొన్నారు. స్థానిక నామా ఎరుకలయ్య ఆశ్రమంలోని శ్రీ శారదా జూనియర్ కళాశాలలో సోమవారం కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఎం సురేష్ బాబు రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పేద విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా బోధన చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను దృష్ఠిలో ఉంచుకుని కళాశాలలోని 250 మంది పైగా విద్యార్థులందరికి ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని రెండు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత సంవత్సరం కరోనా ఉధృతి లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించామన్నరు. నామా ఎరుకలయ్య ఆశ్రమం స్థాపించినప్పుడు ఆయన విద్యార్థులకు మంచి భోజన వసతి ఏర్పాటు చేసే వారని, ఆయన స్ఫూర్తితోనే నేను ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, లా భాఆపేక్ష లేకుండా కళాశాల నడుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం దుర్గాభవాని, బిఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ధనరాజ్, పలు డిగ్రీ, ఇంటర్ కళాశాల యాజమాన్యాలు పాల్గొన్నారు.














Comments