ఆక్రమణ ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు పట్టివేత
- PRASANNA ANDHRA

- May 23, 2024
- 1 min read
Updated: May 24, 2024

ఆక్రమణ ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు పట్టివేత


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం ఎర్రగుంట్ల మార్గంలోని పాలకేంద్రం వద్ద ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఎర్రగుంట్ల వైపు నుండి రెండు లారీలు వస్తుండటం గమనించి, వాటిని ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిపోతున్న ఇసుకను గుర్తించారు. అక్రమ ఇసుక ఎక్కడిదని లారి డ్రైవర్లను ప్రశ్నించగా? ఎర్రగుంట్ల మండలం, ఆంజనేయపురం గ్రామం సమీపాన గల పెన్నా నది దగ్గర ఆంజనేయపురం శివ, పోట్లదుర్తి గ్రామానికి చెందిన శివారెడ్డి లు డబ్బులు తీసుకొని లారిలకు ఇసుక లోడ్ చేసినట్లు, సదరు రెండు లారీలు గిద్దలూరు లో అక్రమంగా ఇసుక అమ్మేందుకు వెళ్తున్నట్లు విచారణలో తేలగా, ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి లారీలను సీజ్ చేయడం జరిగినట్లు, డ్రైవర్లు, లారీ ఓనర్లు, అలాగే పోట్లదుర్తి గ్రామానికి చెందిన శివారెడ్డి , శివ లపై కలిపి మొత్తం 6 మందిపై కేసు నమోదు చేసినట్లు పత్రికా ప్రకటన ద్వారా ఒకటో పట్టణ సీఐ తెలిపారు.











Comments