top of page

క్రీడల్లో రాణించిన సచివాలయ ఉద్యోగులకు సన్మానం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 21, 2022
  • 1 min read

జిల్లా స్థాయి ఉద్యోగుల క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన చిట్వేలి మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో సన్మానించారు .గత శనివారం కడపలో జరిగిన క్రీడాపోటీలో మైలపల్లి గ్రామ సచివాలయానికి చెందిన ఇంజినీరింగ్ సాహాయకురాలు లక్ష్మిదేవి చదరంగం విభాగంలో జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించారు .

తిమ్మాయగారిపల్లి గ్రామ సచివాలయానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ శివచందు జావలిన్ త్రో విభాగంలో తృతీయ బహుమతి సాదించారు .జిల్లా స్థాయి క్రీడల పోటీల్లో చిట్వేలి మండలానికి గుర్తింపు తెచ్చిన ఇరువురిని.. పలువురు అధికారులు, వక్తలు ప్రశంసిస్తూ అభినందించారు .

ree

ఈ సన్మాన కార్యక్రమంలో చిట్వేలి మండలాధ్యక్షులు టంగుటూరి చంద్ర , మండల ప్రత్యేకాధికారి డాక్టరు కె డి వరప్రసాద్ , తహశీల్దార్ జీవన్ చంద్రశేఖర్ , ఎంపీడీఓ సమత ,ఏ ఇ అర్ డబ్ల్యు ఎస్ గిరిధర్ , హోసింగ్ ఏ ఇ సుధాకర్ , కో ఆప్షన్ సబ్యులు ఆన్సర్ బక్స్ , పరిపాలనాధికారి నాగభూషణం , సీనియర్ అసిస్టెంట్ నాగరాజు ,పంచాయితీ కార్యదర్శి తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు .

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page