సాగునీటి సంఘాల ఎన్నికల అధికారులకు శిక్షణ
- PRASANNA ANDHRA

- Dec 3, 2024
- 1 min read
సాగునీటి సంఘాల ఎన్నికల అధికారులకు శిక్షణ

ప్రొద్దుటూరు
ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో పోలింగ్ అధికారులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిదవ తేదీన ఉదయం 10 గంటలకు నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, గడువు తర్వాత ఎన్నిక సాయంత్రం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అవగాహన కల్పించారు. ఓటింగ్ ప్రక్రియ ఓటర్లు తమ బలపరిచే అభ్యర్థి కి చేతులెత్తడం ద్వారా చేపడతామని, ఓటర్లు తమకిష్టమైతే బ్యాలెట్ ప్రక్రియ ద్వారా కూడా ఓటు వేయవచ్చునని ఓటింగ్ నందు అభ్యర్థి నెంబర్ ఎక్కువ ఓట్లు వచ్చిన యెడల డిప్యూటీ అభ్యర్థి ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుందన్నారు. నామినేషన్ పత్రాలు ఎలా పూరించాలో ఈ శిక్షణ కార్యక్రమంలో తెలిపారు. మైలవరం కేసీ కెనాల్ సాగునీటి కాలువలు, ప్రొద్దుటూరు పెద్దశెట్టిపల్లె, మడూరు, బొల్లవరం, ఉప్పరపల్లె సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.








Comments