top of page

మరణించినా కానరాని కనికరం... అంబులెన్సు యజమాని నిర్వాకం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 26, 2022
  • 1 min read

మరణించినా కానరాని కనికరం... తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్ ల దందాను కట్టడి చేయాలి: కందారపు మురళి

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతున్న దని వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాటి ఉదయం 2 గంటల సమయంలో జేసవా అనే బాలుడు కిడ్నీ విఫలమవడంతో మరణించాడు... మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు వారిని వేడుకున్నా... అంబులెన్స్ దళారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక స్కూటర్ పైనే రాజంపేట జిల్లా లోని చిట్వేలుకు 90 కిలోమీటర్ల (బాధితుని గ్రామం పెనగలూరు మండలం లోని కొండూరు ఎస్.టి కాలనీ - పేరు కంభంపాటి జేశవా) బాలున్ని తరలించారు. ఉచితంగా తరలిస్తామని ముందుకు వచ్చిన అంబులెన్స్ ను రానివ్వకుండా దాడికి పూనుకోవడంతో విధి లేక విషమ పరిస్థితిలో ఆ తండ్రి మరణించిన తన బిడ్డను స్కూటర్ పై 90 కిలోమీటర్లు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.. ఈ పరిస్థితికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Ram Manoj Kumar Nallam Setty
Ram Manoj Kumar Nallam Setty
Apr 26, 2022

ఇలా శవాల మీద పడి బ్రతికే బదులు... తు...


Like
bottom of page