ఆర్టిపిపి డంపింగ్ యార్డులో మృతదేహం
- PRASANNA ANDHRA

- Jul 4, 2024
- 1 min read
ఆర్టిపిపి డంపింగ్ యార్డులో మృతదేహం

కడప జిల్లా, ఎర్రగుంట్ల
మండల పరిధిలోని డాక్టర్ ఎం వి ఆర్ రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ బొగ్గు యూనిట్లకు సరఫరా చేస్తున్న సమయంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో కార్మికులు ఉన్నత అధికారులకు తెలియజేశారు. అధికారులు కలమల్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెండు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టు నుండి ఆర్టీపీపికి బొగ్గు వ్యాగన్లు వచ్చాయని తెలిపినట్లు సమాచారం. కృష్ణపట్నంలో చంపి వేశారా, దారి మధ్యలో శవాన్ని వేశారా, ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.









Comments