top of page

జనసేన నాయకులు నాగబాబు ను కలిసిన రైల్వేకోడూరు జనసేన నాయకులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 15, 2022
  • 1 min read

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు ను కలిసిన

రైల్వేకోడూరు జనసేన నాయకులు.


ree

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం లోని సమస్యలను వివరించడానికి హైదరాబాద్ లోని జనసేన సెంట్రల్ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు తో రైల్వే కోడూరు జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్,ఆంకిశెట్టి మణి,వర్ధనగారి ప్రసాద్, నగిరిపాటి మహేష్, జంపన్న లు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేశారు.


ఈ సమావేశంలో జనసేన నాయకులు నాగబాబు కు సమస్యలను గూర్చి వివరిస్తూ రైల్వేకోడూరు జనసేన నియోజకవర్గ అభివృద్ది,పటిష్టత, జనసైనికులు చేస్తున్న పోరాటాలు గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని, తెలియజేశారు.అన్ని విషయాలను క్షుణ్ణంగా విన్న తర్వాత ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పటిష్టత కోసం కష్టపడే ఏ ఒక్కరికీ పార్టీ అన్యాయం చేయబోదని,ప్రజా సేవే పరమావధిగా జనసేన జెండాతో పోరాటాలు చేసే ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని నాగబాబు హామీ ఇవ్వడం జరిగిందని,రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయమే పరమావధిగా ప్రతిఒక్కరూ మరింతగా కష్టపడాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన విషయంలో పార్టీ అధిష్టానం పటిష్టమైన సమాచారంతో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే బరిలోకి దింపుతారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే జనసేన పార్టీ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సమర శంఖారావం పూరించాలని,అక్టోబర్ నెలలో విజయదశమి రోజున ప్రారంభించే పవన్ కళ్యాణ్ గారి యాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్బంగా నాగబాబు తెలపడం జరిగిందన్నారు.రైల్వే కోడూరులో జనసైనికులు చేస్తున్న అద్భుతమైన జనసేన పోరాటాల గురించి ఆయన విన్న తరవాత హర్షం వ్యక్తం చేయడం జరిగిందన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page