top of page

ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 10, 2022
  • 1 min read

ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు. ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడిందని, ఈ జంతువును ఢీ కొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తెలిపారు. కజిరంగా వద్ద వన్య ప్రాణులను సంరక్షించాలనే సంకల్పంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా 32 కిమీ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించడంపై పని చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page