ప్రజా భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.
- DORA SWAMY

- Oct 20, 2022
- 1 min read
ప్రజా భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.చెవ్వు శ్రీనివాసులు రెడ్డి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని సమస్యాత్మక పంచాయతీల భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి ఎమ్మార్వో మురళీకృష్ణకు సూచించారు. గురువారం ఉదయం భూ సమస్యల బాధితులతో రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో తో కలసి చర్చించారు. ప్రజలు కార్యాలయాల్లో చుట్టూ తిరిగి అసంతృప్తి చెందకు ముందే కాలయాపన చేయక, వారికి తగు న్యాయం చేయాలని, స్పందనలో వచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా మండల కన్వీనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి.వెంకటరమణ, లింగం లక్ష్మీకర్, సర్పంచ్ ఈశ్వరయ్య, మండల బిజెపి బాధ్యులు ఆకేపాటి వెంకటరెడ్డి, బాధితులు పాల్గొన్నారు.








Comments