గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
- EDITOR

- Jan 23, 2023
- 1 min read
గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
భారత దేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని అధికార, అనధికారులు అందరూ కలిసి విజయవంతం చేయాలని సబ్-కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అన్నమయ్య సభా భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు, రాజంపేట పట్టణ పౌరులు భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి విద్యుత్ శాఖ డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి, సబ్-రిజిస్ట్రార్, డీఎఫ్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








Comments