top of page

రిపోర్టర్ నిజాయితీ ఎస్సై వెంకటేశ్వర్లు అభినందనలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 3, 2022
  • 1 min read

-దొరికిన మొబైలు ఎస్ఐకి అప్పగించిన వర్ణ కుమార్ రాజు.

--బాధితునికి అందించిన ఎస్సై వెంకటేశ్వర్లు.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం సదరు గ్రామంలో గరుగుపల్లి కి వెళ్లే రహదారి యందు స్థానికంగా అంతరాత్మ పేపర్ కు విలేఖరిగా పనిచేస్తున్న వర్ణ కుమార్ రాజు కు 17 వేల రూపాయలు విలువగల వివో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను దొరకడంతో తాను బాధ్యతగా వ్యవహరించి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్సై వెంకటేశ్వర్లు అందజేయడంతో వర్ణ కుమార్ రాజు ను పలువురు అభినందించారు.


తమది కాని విలువైన సంపద తమకు దొరికినప్పుడు తిరిగి ఇచ్చి వేయడం దానిని బాధితునికి అందించడం గొప్ప విషయమని,ప్రతి ఒక్కరూ దీనిని అనుసరించాలని ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు.


ఆ ఫోను మండల పరిధిలోని ఎం.గొల్లపల్లి నివాసి ఏమిక చంద్రయ్యదిగా గుర్తించి తిరిగి అతనికి అందించారు. బాధితుడు ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page