మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి "రెడ్యం" సవాల్
- PRASANNA ANDHRA

- Jan 9, 2022
- 1 min read
పుంగనూరు నియోజకవర్గంలో మీ అటెండర్ తో పోటీ చేయించి దమ్ము ధైర్యం ఉంటే మీరు కుప్పంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పై పోటీ చేయాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి సవాల్ విసిరారు, ఆదివారం ఉదయం బద్వేలు లోని మాజీ శాసనసభ్యురాలు కొండ్రెడ్డి విజయమ్మ స్వగృహంలో పార్టీ శ్రేణులతో కలిసి రెడ్యం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ, అధికారబలం, డబ్బుమదం, పోలీసుల ప్రోద్బలంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలు, ఉత్తరకుమార ప్రగల్భాలు ప్రజలు అసహ్యించుకుంటున్నారని, త్వరలో వైసిపి నేతలను ప్రజలు తరిమి తరిమి కొడతారని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు, వైసీపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రెడ్యం హితవుపలికారు.
కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబునాయుడు ఏడు సార్లు దిగ్విజయంసాధించిన విషయం మరచి ఆయన ప్రజా బలాన్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గదని, మీ బలం పెరగదని విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలని, దొంగ ఓట్లతో, అధికార బలంతో, అరాచకాలతో కుప్పం మున్సిపాలిటీ గెలుపు ఒక గెలుపేనా? అని రెడ్యం విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు 43% శాతం భారీ ఫిట్మెంట్ ఇచ్చారని, జగన్ పాలనలో కేవలం 23% శాతం ఫిట్మెంట్ ఇచ్చి జబ్బలు చరువుకోవడం, సంబరాలు చేసుకోవడం, వైసిపి మోచేతికింద నీళ్లు తాగే ఉద్యోగ సంఘాలకు, వైసీపీ నేతలకె చెల్లిందని రెడ్యం విమర్శించారు.
ఇకనైనా నవ్యాంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వఉద్యోగులు ఆలోచించి చంద్రబాబునాయుడుని నిండు మనసుతో ఆశీర్వదించి తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ బీసీ నేస్తం పథకాన్ని 9వ తేదీన ఆర్భాటంగా ప్రకటిస్తామని చెప్పి నేడు నిధుల్లేక పథకాన్ని ప్రారంభించకపోవడం ఈబీసీలను మోసం చేయడమేనని, ఈ విషయంపై ఈబీసీలందరూ స్పందించాలని రెడ్యం విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో తెదేపా సీనియర్ నాయకుడు నరసింహనాయుడు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా( బిగ్ బాస్) తెదేపా బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి, బద్వేలు రూరల్ మండలపార్టీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి (టీవీఎస్ రవి) తేదేపా నాయకులు వడ్లపుటి నాగభూషణం, కొలవలివేణుగోపాల్ తదితరులు ఉన్నారు.








Comments