top of page

రాపూర్ ఘాట్ లో రోడ్డు ప్రమాదం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 16, 2022
  • 1 min read

రాపూర్ ఘాట్ లో రోడ్డు ప్రమాదం ప్రయాణికులు సురక్షితం - బాధ్యతారహితంగా ఆర్టీసీ డ్రైవర్లు అంటూ బాధితుని గగ్గోలు.

రాపూర్ ఘాట్ రోడ్ లో ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్వల్ప గాయాలు చోటు చేసుకున్నప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. కాగా ఇటియోస్ కారు మాత్రం ఒక భాగం నుజ్జు నుజ్జు అయినది.

ree

వివరాల్లోకి వెళితే చిట్వేలు మండలం గొల్లపల్లి అరుంధతి వాడకు చెందిన పందికాళ్ల ఈశ్వరయ్య తన సొంత AP39GS8346 ఇతియోస్ వాహనంలో ఈరోజు ఉదయం శ్రీపెనుశిల నరసింహ స్వామి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణం లో ఉండగా రాపూరు నుంచి ఘాట్ రోడ్ మూడో మలుపు వద్ద రాయచోటి డిపోకు చెందిన AP04Z 0171

నంబర్ కల ఆర్టిసి బస్సు నెల్లూరు కి వెళుతూ కారును క్రాస్ చేయడంతో కారు కుడి వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ree

ఘాట్ రోడ్డు ప్రయాణం ఇబ్బందితో కూడినది అని తెలిసినప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ బస్సు చోదకలే.. కేవలం గమ్యాన్ని చేరాలన్న ఆలోచనతో జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలకు కారణమవడం విడ్డూరంగా ఉందని బాధితులు, వారి సంబంధీకులు పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page