top of page

"జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం విజయవంతం - మేడా, ఆకేపాటి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 29, 2023
  • 1 min read

"జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం విజయవంతం - మేడా, ఆకేపాటి

సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే మేడా

ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం విజయవంతమైందని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు సంయుక్తంగా తెలియజేశారు. బోయినపల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మేడా, ఆకేపాటి లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడపగడపకు అందుతున్న సంక్షేమ పథకాల పైన ప్రజలలో విశేష స్పందన ఉందని తెలిపారు. నియోజకవర్గంలో 80 వేలకు పైగా కుటుంబాల నుంచి మిస్డ్ కాల్ లు వచ్చాయని, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని, రాబోవు ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజారిటీతో గెలవడం ఖాయమని తెలియజేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు సంతకం చేసిన పుస్తకాలను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page