top of page

జాతి మెచ్చిన నేత బి.ఆర్ అంబేద్కర్ - సాయి లోకేష్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 6, 2022
  • 1 min read

జాతి మెచ్చిన నేత బి.ఆర్ అంబేద్కర్ - సాయి లోకేష్

సాయి లోకేష్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

ree

రాజంపేట, జాతి మెచ్చిన నేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బిజెపి రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు మరియు రాజంపేట పార్లమెంటు ఇంచార్జి సాయి లోకేష్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సాయి లోకేష్ స్వగృహంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయి లోకేష్ మాట్లాడుతూ శీతాకాలం దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ స్ఫూర్తితో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ సాధించిన ఘనతను ప్రజలకు వివరించారు. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు నిర్వచనీయమైన శక్తి అని పేర్కొన్నారు. అనంతరం రాజంపేట బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కలలుగన్న భారతావని, ఆయన ఆశయ సాధన బీజేపీతోనే సాధ్యమని తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page