top of page

రామయ్యకు మకర తోరణం వితరణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 14, 2023
  • 1 min read

రామయ్యకు మకర తోరణం వితరణ

ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని ఊటుకూరు గ్రామం నడి వీధిలో వెలసియున్న శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఆలయానికి అదే గ్రామానికి చెందిన సూరపరాజు సుబ్రహ్మణ్యం రాజు, నాగలక్ష్మి దంపతులు శనివారం మకర తోరణం బహుకరించారు. శనివారంతో కూడిన భోగి పర్వదినం కావడం చేత ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దాత సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పర్వదినాన రామయ్యకు మకర తోరణం బహూకరించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. రాములవారి కృపతో గ్రామము, ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page