రాజంపేటలో ఘోరం...
- EDITOR

- Dec 16, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాజంపేట

అన్నమయ్య జిల్లా, రాజంపేట పట్టణం కొత్త బస్ స్టాండ్ సమీపంలో దారుణం జరిగింది.కడప జిల్లా మైదుకూరు కు చెందిన అంకాల్ రెడ్డి (55)అనే వికలాంగ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టి చంపారు.ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగి ఉంటుందని భావిస్తున్నారు.చలి ఎక్కువ ఉండడం వలన జనసంచారం తక్కువగా సమయంలో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఎవరు, ఎందుకు చంపారు అనే విషయాలు తెలియ రాలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









Comments