రాజధానుల వికేంద్రీకరణతోనే ప్రాంతాల అభివృద్ధి - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Nov 16, 2022
- 1 min read
రాజధానుల వికేంద్రీకరణతోనే ప్రాంతాల అభివృద్ధి - రాచమల్లు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శేఖర్ యాదవ్ అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు మేంబర్లను పాల్గొన్నారు. సుధీర్గః చర్చలు సాధ్యాసాధ్యాల అనంతరం మండలనానికి స్మశాన వాటిక ఏర్పాటుకు తగు నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధానుల వికేంద్రీకరణ మద్దతుగా మూడు రాజధానులకు పూర్తి మద్దతు తెలుపుతూ మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు రాజధానుల వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని సంతకాలు చేశారు.

ఈ సందర్భమగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని, రాజధానుల వికేంద్రీకరణతోనే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ నందు నవంబర్ 16, 1937న జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందమని, ఆ ఒప్పందం ప్రకారం 1953 సంవత్సరం ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతో మొదలు, ఇప్పటి వరకు అపరిష్కృత నదుల నీటి పంపకాలు, యునివర్సిటీల ఏర్పాటు, కృష్ణ నది బోర్డు కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు, అసెంబ్లీ సీట్లు పెంపుతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి అంశాలను సూచించడం జరిగిందని, అందుచే రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ శ్రీబాగ్ ఒప్పందంను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. 'శ్రీ భాగ్' ఒప్పందం యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయవలసిన ఆవశ్యకత తనపై ఉన్నదని, రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడే విధంగా రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేయటాన్ని ఆయన స్వాగతించారు. వికేంద్రీకరణ ద్వారా సామజిక న్యాయం అందుతుందని, ప్రాతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, జడ్పీటీసీ వైస్ చైర్మన్ జేష్టాది శారదా, ఉప మండల అధ్యక్షుడు ఆసం దస్తగిరి రెడ్డి, ఎమ్మార్వో నజీర్ అహమ్మద్, ఎంపీడీఓ ఉపేంద్ర, మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.








Comments