భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Nov 10, 2022
- 1 min read
Updated: Nov 11, 2022
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో నూతన మునిసిపల్ కూరగాయల మార్కెట్ సముదాయానికి నవంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ఎకరాల ముప్పై యెనిమిది సెంట్ల స్థలములో యాబై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన మునిసిపల్ కూరగాయల మార్కెట్ సముదాయ భూమి పూజా కార్యక్రమానికి తాను నియోజకవర్గం లోని ప్రతి ఇంటిని సాదరంగా ఆహ్వానిస్తున్నానని, మున్సిపల్ కౌన్సిలర్లు తన తరుపున బాధ్యత స్వీకరించి ప్రతి ఇంటిని పేరుపేరునా భూమి పూజ కార్యక్రమానికి పిలుస్తున్నారని, తన ఆహ్వానాన్ని మన్నించి, ఆహ్వానాన్ని స్వీకరించి నియోజకవర్గంలోని ప్రజలందరూ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. దాదాపు 25 వేల మంది నియోజకవర్గ ప్రజల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, ఉపముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖామాత్యులు షేక్ అంజాద్ భాష, కడప నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, టూరిజం, సాంస్కృతిక యువజన శాఖామాత్యులు ఆర్కే రోజా, కడప మేయర్ కె సురేష్ బాబు తదితరులు పాల్గొంటున్నట్లు ఆయన తెలియజేశారు








Comments