గోడలపై మూత్రం పోయటం శునకాల నైజం - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Apr 29, 2023
- 1 min read
గోడలపై మూత్రం పోయటం శునకాల నైజం - రాచమల్లు


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గోడలపై మూత్రం పోయటం శునకాల నైజం అని, కానీ టిడిపి వారు వైయస్సార్సీపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అతికించిన స్టిక్కర్లను శునకం తొలగిస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా, అలాగే స్వయాన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై రాచమల్లు ఘాటుగా స్పందించారు.

జగనన్నే మా భవిష్యత్తు స్టికర్లు ప్రజలకే కాదు శునకాలకు కూడా నచ్చటం లేదని బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, గత కొద్ది రోజుల క్రిందట చిత్తూరు జిల్లాలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి గోడపత్రాలపై శునకం మూత్రం పోసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, గోడలపై మూత్రం పోయటం శునకాల నైజమని, ఇందులో తప్పు పట్టవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. శునకాలు గోడపత్రాలపై మూత్రం పోయటానికి తాము తప్పు పట్టడం లేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ కాకర్ల నాగ శేషారెడ్డి, ప్రొద్దుటూరు మండల సచివాలయ కన్వీనర్ కల్లూరు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.



ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్ లో ప్రకటనల కోసం సంప్రదించండి 9908051001








Comments