ప్రజా చైతన్యం తో ఉద్యమాన్ని ఉదృతం చేయాలి - ఆర్ నారాయణ మూర్తి
- PRASANNA ANDHRA

- Feb 16, 2022
- 1 min read
ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, సాంస్కృతిక కళారూపాలతో ప్రజా చైతన్యం కలిగించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సినీ కళాకారుడు ఆర్ నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 365 రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్కు నగరం సిడబ్ల్యూసి 1 లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు కలుగుతున్న అన్యాయాన్ని కళారూపాల ద్వారా కళాకారులు ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతుల్ని చేసి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయమని వారి నిర్ణయం మేరకే మంచి పాలకులు మనకు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. తద్వారా మంచి పాలన ప్రజా సంక్షేమంతో దేశం అభివృద్ధి కి దోహదపడుతుందని ఆయన వివరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ పోరాటాన్ని ఉత్తేజపరచిన పాట రచయిత సుద్దాల అశోక్ తేజ పాటను మనకు అందించిన గాయకుడు "రాంకీ" ని ఆయన సత్కరించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వామ్యం అయిన స్థానిక కళాకారులను ఆయన అభినందించారు. స్థానిక రచయితలచే రచించబడిన పాటల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు సి హెచ్ నర్సింగరావు, డి ఆదినారాయణ, గంధం వెంకట్రావు, జె. అయోధ్య రామ్, వైటి దాస్, కె. సత్యనారాయణ రావు, వై మస్తానప్ప, బొడ్డు పైడిరాజు, వి. రామ్ మోహన్ కుమార్, వరసాల శ్రీనివాస్, సిహెచ్ సన్యాసిరావు, కె.ఎమ్. శ్రీనివాస్ తదితరులతోపాటు స్థానిక కళాకారులు అధిక సంఖ్యలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.









Comments